మియాపూర్ మదీనాగూడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అమీన్పూర్ సమీపంలోని గుట్టల్లో మృతదేహాన్ని పడేశారు.మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌గా గుర్తించారు.
ఈ నెల 9న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగిరాలేదు. సైబరాబాద్ సంయుక్త పోలీసు కమిషనర్ ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన హత్య వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు ఎవరితో ప్రాణాలు తీసేంత పగా ప్రతీకారాలు లేవని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు పోలీసులు.