అక్క మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... - MicTv.in - Telugu News
mictv telugu

అక్క మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య…

March 17, 2018

కుటుంబ  సభ్యులు మందలించారని  ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్  నాగోల్ జైపురికాలనీలో చోటు చేసుకుంది. జైపురికాలనీకి చెందిన భూపాల్‌రెడ్డి కుమార్తె సాయిప్రియ (18)  గాయత్రి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. పరీక్షలు ముగియడంతో ఇంట్లో ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో తన సోదరితో తరుచూ వాట్సాప్‌లో చాటింగ్ చేస్తోంది. ఆమె  సోదరి మదలించడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి బెడ్‌రూంలో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపులు తీయకపోవటంతో తలుపులు బద్దలు కొట్టారు. అపస్మారక స్థితిలో వున్న ఆమెను సుప్రజ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇంటర్‌ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయాననే బాధతోనే ఆత్మహత్య  చేసుకుందని తండ్రి భూపాల్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు  చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సాయిప్రియ  వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో… ‘నేను అందరికీ కోపం తెప్పిస్తున్నాను. నేను ఎందుకు బతికి వున్నాననే బాధ రోజురోజుకు ఎక్కువ అవుతోంది. నేను చచ్చిపోతే పనైపోతుంది కదా. డాడీ సారీ… ఐ లవ్‌ మమ్మీ, డాడీ. ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే అందరూ నేను చనిపోవటానికి కారణం ఇంటర్‌ పరీక్షలు అనే అనుకుంటారు…. నేను పరీక్షలన్నీ మంచిగా రాశాను.అందుకే పరీక్షలు ముగిసాక చచ్చిపోవాలని డిసైడయ్యాను. మా అన్న, అక్కకి నేను చచ్చిపోతే హ్యాపీ…’ అంటూ అందులో పేర్కొంది.