ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ !

September 15, 2017

రాందేవ్ బాబా ఇకనుండి తన పతంజలి ఉత్పత్తులకు దేశీ మార్కెట్లో తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడట. కేవలం అంతర్ఝాతీయంగానే పతంజలికి బ్రాండ్ అంబాసిడర్ గా వుండనున్నాడు. పతంజలికి తొలుత నుండి తనే ప్రచారకర్తగా వున్నాడు. తన పక్కన ఆచార్య బాల కృష్ణుడు కూడా వున్నాడు. పతంజలి ఉత్పాదనలకు దేశ, విదేశాల్లో తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. దేశీ ఉత్పత్తులనే ముద్ర పడిపోవడం వల్ల చాలా మంది వినియోగదారులు వీటిని వాడటం  మొదలు పెట్టారు. ఇప్పటికే యూరప్, బ్రిటన్, అమెరికాలల్లో పతంజలి స్టోర్స్ వున్నాయి. అక్కడ కూడా నెమ్మదిగా పతంజలికి డిమాండ్ పెరిగింది. అందుకని అక్కడ పతంజలి ఇంకా బాగా జనాల్లోకి చొచ్చుకెళ్ళాలంటే తనే రంగంలోకి దిగి బ్రాండ్ అంబాసిడర్ గా విపరీతంగా ప్రమోట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్టున్నాడు.

అందుకే ఈ నిర్ణయం తీస్కున్నాడు. అంతర్ఝాతీయంగా పతంజలిని నిలబెట్టడానికి బాబా రాందేవ్ చాలా కష్ట పడుతున్నాడు కదూ. ఇక దేశీ మార్కెట్లో మోడల్స్ చేతే ప్రచారం చేయించే యోచనలో వున్నాడట. ఎలాగైనా దేశ విదేశాల్లో కేవలం ఒక్క పతంజలి మాత్రమే నిలబడాలి, ప్రపంచం యావత్తు పతంజలి వినియోగదారులై వుండాలని కంకణం కట్టుకున్నాడేమో. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. విదేశాల్లో పతంజలి అమ్మకాలు పుంజుకున్నాయంటే తర్వాత తను బ్రాండ్ అంబాసిడర్ గా రిటైర్ అయి తన స్థానంలో ఆయా ప్రాంతీయ మోడల్స్ ను పెట్టి ప్రచారం చేయించే యోచనలో మహా గట్టిగా వున్నాడట బాబా రాందేవ్ సాముల వారు.