మగాళ్లకూ ఉందోయ్ ఒక రోజు..! - MicTv.in - Telugu News
mictv telugu

మగాళ్లకూ ఉందోయ్ ఒక రోజు..!

March 8, 2018

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు వేడుకలు  నిర్వహించుకుంటున్నారు. వారికి పురుషులు కూడ ాశుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే మహిళలకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఉన్నట్టే పురుషులకు కూడా ఓ ప్రత్యేకమైన  రోజు ఉందని మీకు తెలుసా? అవును నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ ఈ వేడుకను 70 దేశాల్లో మాత్రమే నిర్వహించుకుంటున్నారు.ఈ ఏడాది మెన్స్ డే కోసం ‘పాజిటివ్ మేల్ రోల్ మాడల్స్’ అనే థీమ్‌ ఏర్పాటు చేశారు. ఓ మంచి  స్ఫూర్తిదాయక పురుషుడిని ఆదర్శంగా తీసుకుని పిల్లలు ఎదగాలని మెన్స్ డే ఆర్గనైజర్లు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మెన్స్‌ డే కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ (www.internationalmensday.com) కూడా ఉందండోయ్. పురుషులు, బాలుర ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆ సైట్‌లో ఆర్గనైజర్లు కోరారు. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను బలపరచడం, లింగ సమానత్వం లాంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.