మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు... - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు…

March 6, 2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం, వ్యవసాయం, సమాజసేవ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు.  మార్చి8న రూ.లక్ష రివార్డుతో మహిళ శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సంత్కరించనున్నారు.ఇటీవల జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన అరుణారెడ్డితో పాటు, సినిమా డైరెక్టర్‌ నందినీరెడ్డి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డ్రైవర్‌ సుప్రియ సనం, ఢిల్లీ ఆర్టీసీ డ్రైవర్‌ సరిత, ఉద్యమ గాయకురాలు ఎదునూరి పద్మ, మహిళా సాధికారతలో యాప భద్రమ్మ తదితరులు అవార్డుకు ఎంపికయ్యారు.