ఇంటర్నెట్ స్పీడులో భారత్‌కు 109వ స్థానం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్నెట్ స్పీడులో భారత్‌కు 109వ స్థానం

December 11, 2017

2జీ పొయ్యి 3జీ వచ్చే డాం డాం డాం, 3జీ పొయ్యి 4జీ వచ్చే డాం డాం డాం. ఇంకొన్ని రోజులు పోతే మనదేశంలో 5జీ కూడా రావడానికి సిద్దంగా ఉంది. 4జీ స్పీడ్ కే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. కానీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అందించడంలో మనదేశ స్థానం 109. అంటే అర్థం చేసుకోండి మొదటి స్థానంలో ఉన్న దేశం ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంటుందో.

ఇక బ్రాండ్ బ్యాండ్ స్పీడ్లో 76వ స్థానంలో భారత్ నిలిచింది. ఇంటర్నెట్ స్పీడ్ ను అంచనా వేసే ఓక్లా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియాలో మొబైల్‌  ఇంటర్‌నెట్‌  స్పీడ్‌, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ వేగం ఇప్పుడిప్పుడే   భారీగా పుంజుకుంటున్నాయి. దీని ప్రకారం సగటు మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 7.65  ఎంబీపీఎస్‌ గా నిలిచింది.   ప్రపంచవ్యాప్తంగా వేగంగా మొబైల్ ఇంటర్నెట్ అందించడంలో నార్వే దేశం మొదటి స్థానంలో నిలివగా, బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ అందించడంలో సింగపూర్ మొదటి ర్యాంకు కొట్టేసింది.