తెలుగు మహాసభలకు చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభలకు చంద్రబాబు

December 1, 2017

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డిసెంబర్ 15వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. 

ఈ మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రానున్నారు. ఆయనను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ ప్రారంభ వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు హాజరవుతారు.

లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానించాలి. మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ప్రారంభ వేడుకకు హాజరవుతారని ’ కేసీఆర్ తెలిపారు.