పాక్ నుంచి రాజమౌళికి ఆహ్వానం - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ నుంచి రాజమౌళికి ఆహ్వానం

March 28, 2018

తన కెరియర్‌లో దర్శకత్వం వహించిన సినిమాలు ఒక ఎత్తు అయితే ‘ బాహుబలి ’ ఒక ఎత్తు అని అభిప్రాయపడ్డారు దర్శకుడు రాజమౌళి. కరాచీలో నిర్వహించబోయే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌‌లో పాల్గొనవలసిందిగా రాజమౌళికి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.‘ బాహుబలి సినిమా చేయటం నాదొక సాహసమే. సాహసాలు చేస్తే ఫలితాలు చాలా గొప్పగా వుంటాయని నిరూపితమైంది. ఆ సినిమా నాకు అనేక దేశాలు తిరిగే అవకాశాన్ని కల్పించింది. వాటన్నింటికన్నా ఇప్పుడు పాక్ నుంచి నాకు ఆహ్వానం రావటం చాలా గర్వంగా ప్లస్ స్పెషల్‌గా అనిపిస్తోంది. నన్ను ఆహ్వానించిన పాకిస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు ’ అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.