ఐపీఎల్ పాట.. నెటిజన్లు ఫిదా... - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ పాట.. నెటిజన్లు ఫిదా…

March 13, 2018

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -2018సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం  కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రచార గీతాన్ని లీగ్ నిర్వాహికులు విడుదల చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి బీసీసీఐ ప్రసార హక్కులను స్టార్ ఇండియా దక్కించుకుంది. ఈ ప్రచార పాటను రూపోందించి, ‘బెస్ట్ వర్సెస్ బెస్ట్’ అనే పేరుతో విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సూపర్ అంటూ నెటిజన్లు కామెంటుతున్నారు.

ఈ పాటను దేశ వ్యాప్తంగా  హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ భాషల్లోని టీవీ, రేడియో, డిజిటల్  ఫ్టాట్ ఫామ్స్‌లో విడుదల చేసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు రాజీవ్ వీ.భల్లా ఆధ్వార్యంలో గాయకుడు సిద్దార్థ్ బస్రుర్ ఐదు భాషల్లో పాడాడు.

1957లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘నయాదౌర్ ’లోని ‘యే దేశ్ హే వీర్ జవానో కా’ పాటను స్పూర్తిగా తీసుకుని ఐపీఎల్ సాంగ్‌ను తీర్చిదద్దారు. మరోవైపు సోషల్‌మీడియాలో అప్పడప్పుడూ మాత్రమే స్పందించే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ సాంగ్‌ను షేర్ చేయడం విశేషం.