రణవీర్ 15 నిమిషాలు ఉండటానికి 5 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

రణవీర్ 15 నిమిషాలు ఉండటానికి 5 కోట్లు

March 26, 2018

క్రికెట్ అభిమానులు వేయి కన్నులతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 ప్రస్తుత సీజన్  ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలీవుడ్ తారలతో ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. తారల తళుకుబెళుకులు అద్దితే మరింతమంది ప్రేక్షకులకు చేరువకావొచ్చని భావిస్తున్నారు.

ప్రారంభోత్సవాన్ని బాలీవుడ్‌లో ప్రస్తుతం మాంచి ఫాలోయింగ్ ఉన్న హీరో రణ్‌వీర్ సింగ్‌తో చేయించేందు నిర్వాహకు అతణ్ని కలిశారు. పాపు గంట ప్రదర్శన ఇవ్వాల్సిఉంటుందని, అందుకు ఎంత ఫీజు కావాలని అడిగారు. దీనికి రణ్‌వీర్ తడుముకోకుండా  రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు ఐపీఎల్ నిర్వాహకులు కూడా అంగీకారం తెలిపారు. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7-మే 27 తేదీల మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖేడీ స్టేడియంలో ఉంటుంది. ‘బాజీరావు మస్తానీ’, పద్మావతి’ తదితర చిత్రాలతో రణవీర్ ఫామ్‌లో ఉన్నాడు.