‘ఐఏఎస్‌’కోసం అడ్డదారి - MicTv.in - Telugu News
mictv telugu

‘ఐఏఎస్‌’కోసం అడ్డదారి

October 31, 2017

కేరళకు చెందిన సఫీర్ కరీం 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో ఏఎస్పీగా పని చేస్తున్నాడు. కానీ మనోడు ఐఏఎస్ కావాలనుకున్నడు. కష్టపడి ఎవడు సద్వుతడు అనుకుండో ఏమో, టెక్నాలజీని ఉపయోగించి కాపీ కొట్టి పాసైపోదాం అన్కున్నడు, అడ్డంగా బుక్కైపోయిండు.

సోమవారం జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌లో హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు. మల్లా అతనికి సహకరించింది ఎవరో కాదు, అతని భార్య జోయ్. హైదరాబాద్‌ కేంద్రంగా ఈహైటెక్ కాపీయింగ్ జరిగింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సఫీర్ కరీం భార్య జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మాయరోగం కాకపోతే ఏందిది కదా, మంచిగ కష్టపడి పరీక్ష రాస్తే, అయితే పాస్ అయితుండే, లేకపోతే మల్లోపారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండే. ఇప్పుడు సూడున్రి చేసిన ఎదవ పనికి కటకటాల వెనుకకు పోయే పరిస్థితి వచ్చే, చేసుకున్నోనికి చేసుకున్నంత అంటే గిదే నేమో.