కూలిన యుద్ధ  విమానం.. 15 మంది మృతి

ఇరాన్‌ దేశ రాజధాని తెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో 16 మంది ఉన్నట్లు సమాచారం. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా ఒకరు మాత్రమే ప్రా ణాలతో మిగిలారు.

Telugu News Iran plane crash At least 15 killed after military cargo flight goes down ..

ఈ విషయాన్ని ఇరాన్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్‌ ధ్రువీకరించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్‌ రాజధాని బిషెక్‌ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్‌ విమానం వేరే రన్‌వేపై ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కూలిపోయింది.

విషయం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిన ప్రదేశంలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. హెలికాప్టర్‌, అంబులెన్స్‌తో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటికే పలు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన ఇంజినీర్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

Telugu News Iran plane crash: At least 15 killed after military cargo flight goes down