ఎప్పుడూ సినిమాలు చేసుకుంటూ సూపర్ కూల్‌గా వుండే అనుష్కా శర్మ తనమీద వదంతులు పుట్టించేవారి మీద గుర్రుమంది. ఆమె తల్లి కాబోతోందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఆమె తాజాగా నటించిన ‘జీరో’ సినిమా తర్వాత అనుష్క తదుపరి చిత్రాన్ని ప్రకటించకపోవడంతో ఆమె గర్భం దాల్చారని అందుకే ఏ సినిమాకీ ఒప్పుకోవడంలేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై అనుష్క మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.
‘ఇలాంటి అర్థంలేని వార్తలు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయి? పెళ్లిని దాచగలం కానీ గర్భాన్ని దాచలేం కదా. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ కథానాయిక ఇలాంటి నిరాధార వదంతులను ఎదుర్కొంటూనే ఉంటారేమో. ఇలాంటి పుకార్లు నటీమణులను పెళ్లి కాకుండానే వివాహితను చేసేస్తాయి, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయి. అయినా నేను ఇలాంటి ఫేక్ వార్తలను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను నా పనులతో 24 గంటలు బిజీగానే వుంటాను కాబట్టి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుష్క.
ప్రస్తుతం టెస్ట్ సిరీస్ నిమిత్తం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. త్వరలో అనుష్క కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. డిసెంబర్ 11న తమ తొలి పెళ్లిరోజు వేడుకను అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నారట.
Telugu news Is Anushka Sharma pregnant? The Zero actress shuts down the rumours by calling it ‘silly, absurd and nonsense’