దైవ సమానులైన కన్నవాళ్ళను నిందించడం సంప్రదాయమా ? - MicTv.in - Telugu News
mictv telugu

దైవ సమానులైన కన్నవాళ్ళను నిందించడం సంప్రదాయమా ?

March 28, 2018

‘ఒక అమ్మకు, ఒక అబ్బకు పుట్టినవాడెవరూ చంద్రబాబులా చంద్రబాబులా మాట్లాడడు’ అని వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ తల్లిదండ్రులను దైవసమానులుగా భావిస్తాం. దేవుళ్ళతో సమానంగా వారి ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తాం. అలాంటి దైవ సమానులైని కన్నవాళ్ళను నిందించడం భారతీయ సంప్రదాయమా ? అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను. ప్రధాని కాళ్ళకు మొక్కటం వాళ్ళకు సంప్రదాయమేమో. ఇలా నన్ను ఎంతమంది ఎన్నిరకాలుగా నిందించినా ప్రజలకోసం సహిస్తాను. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట. నా ఇమేజీని, పార్టీ ఇమేజీని దెబ్బ తీసే చర్యలను సహించేది లేదు. జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కున్నాను, క్లిష్ట సంక్షోభాలను సైతం సమర్థంగా అధిగమించాను ’ అని అన్నారు. టిడిపి ఎంపీలతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటువంటి వాళ్లనా ప్రధాని కార్యాలయం చేరదీసేది అని అడిగారు. తాను ఏ విషయంలోనూ తొందరపడనని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకంజ వేయనదని కొంత మంది అంటున్నారని,ఢిల్లీలోని ఏపి భవన్‌ను సమన్వయ వేదికగా వాడుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జార్ఖండ్ బాధితులకు సహకరంచామని, ఢల్లీలో ఉన్నవారు తమకు సహకరించాలని ఆయన అన్నారు. ఎవరితోనూ రహస్య చర్చలు వద్దని చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, ఎంపీలకు సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని అన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని పార్టీ నాయకులకు ఆయన ఆదేశించారు.