ఆంధ్రజ్యోతి ప్రభుత్వమట! నయం.. రాధాకృష్ణను సీఎం అనలేదు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రజ్యోతి ప్రభుత్వమట! నయం.. రాధాకృష్ణను సీఎం అనలేదు!

February 28, 2018

ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సమాచారాన్నైనా పత్రికలు ప్రభుత్వం పేరుతోనే ప్రచురిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఓ ప్రకటనలో ఏకంగా పత్రికనే ప్రభుత్వంగా మార్చిపడేశారు.  ఆంధ్ర ప్రదేశ్  దేవదాయ శాఖ నుంచి వచ్చిన ఓ ప్రకటనలో ప్రముఖ పత్రిక పేరును ఉటంకించారు. ‘ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ అని వుంది సదరు మహత్తర ప్రకటనలో.దీన్ని చూసిన చాలా మంది ఇదేం విడ్డూరమని ఆశ్చర్యపోతున్నారు. ‘ప్రభుత్వానికి ఆ  పత్రిక మీద వల్లమాలిన అభిమానం వల్ల ఇలా జరిగిందా ? లేకపోతే పత్రికకు ప్రభుత్వం మీద ప్రీతి ఎక్కువై ఇలా రాయించుకుందా ? లేకపోతే అధికారులకు పత్రిక మీద ఇష్టం ఎక్కువయి ఈ పని చేసుంటారు.. ఇంకా నయం ఆ పత్రిక యజమాని రాధాకృష్ణను ముఖ్యమంత్రి అనలేదు..  ’ అని  కామెంట్లు చేస్తున్నారు. దీనిపై గుంటూరు జిల్లా సమాచార శాఖ ఏడీని అడిగితే, ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని, యథాతథంగా పత్రికలకు పంపామని చల్లగా చెప్పుకొచ్చారు.