పవర్ స్టార్ ప్రతాపం పనిచేస్తోందా.. టీవీ9, ఏబిఎన్‌ల రేటింగులు పడిపోయాయా ? - MicTv.in - Telugu News
mictv telugu

పవర్ స్టార్ ప్రతాపం పనిచేస్తోందా.. టీవీ9, ఏబిఎన్‌ల రేటింగులు పడిపోయాయా ?

April 24, 2018

అభిమానం టీవీ ఛానళ్ళ రేటింగ్ మీద ప్రభావం చూపుతుందా ? పవన్ కల్యాణ్ టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళ మీద వరుస ట్వీట్లతో తన బాణాన్ని ఎక్కుపెట్టారు. తదనుగుణంగా పవన్ ఫ్యాన్స్ సదరు ఛానళ్ళ రేటింగ్ పడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అభిమానం ప్రభావం టీవీ ఛానళ్ళ మీద ఏమేర ప్రభావం చూపుతుందో చూద్దాం.. దేశ వ్యాప్తంగా 18 కోట్ల ఇళ్ళు వున్నాయి. తెలంగాణలో కోటి, ఆంధ్రాలో కోటి ఇళ్ళు వున్నాయి. అయితే ఈ టీవీ రేటింగ్స్‌కు సంబంధించి 1200 ఇళ్ళలో మీటర్స్ వున్నాయి. యావరేజ్‌గా 8500 ఇళ్ళకు కలిపి ఒక మీటర్ వుంది. మరి ఆ మీటర్స్ వున్నవాళ్ళ ఇళ్ళలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం వుందా అంటే లేదని చెప్పొచ్చు. ఆవేశంగా కొంతమంది చూడమన్నా నడవదు. ఎందుకంటే ఇంట్లో మీటర్ వుంటేనే లెక్కలోకి వస్తుంది అని చెప్తోంది BARK ( రేటింగ్స్ కొలిచే మీటర్లు ). బార్క్ ప్రతి గురువారం 12 గంటలకు టీవీ రేటింగ్స్ విడుదల చేస్తుంది.

పవన్ ఇష్యూ ప్రారంభమై ఇంకా వారం కాలేదు కాబట్టి ఇప్పుడప్పుడే సదరు ఛానళ్ళ రేటింగ్స్ పడిపోయాయని చెప్పటానికి వీలు లేదు. పవన్ ప్రభావం ఆ రెండు ఛానళ్ళపై ఏ మేరకు వుందనేది తెలియాలంటే గురువారం మధ్యహ్నం వరకు ఆగాల్సిందే. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఆ రెండు ఛానళ్ళ వ్యూస్‌ను మాత్రం పవన్ ఫ్యాన్స్ పని గట్టుకుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏబీఎన్, టీవీ9 ఫేస్‌బుక్ పేజీలకు డిస్‌లైక్ కొట్టమని, యూట్యూబ్ ఛానళ్ళను అన్ సబ్‌స్క్రైబ్ చేసుకొమ్మని పోస్టర్లు తయారుచేసి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేస్తున్నారు. అభిమానానికి టీవీ రేటింగుకు సంబంధం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ తమిళనాడులో జరిగిన సన్ టీవీ, జయ టీవీల గురించి మనకు తెలిసిందే. ఆ రెండు ఛానళ్ళ మధ్య వైరం ఉండేది. జయలలితకు సంబంధించింది జయటీవీ. జయలలిత అధికారంలోకి వచ్చాక సన్ టీవీని పదవ వంతు కూడా అందుకోలేకపోయిందని తెలిసిందే. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏంటంటే అభిమానం టీవీ రేటింగ్ మీద ఏమాత్రం ప్రభావం చూపదని. టీవీ9, ఏబీఎన్‌లతో మాట్లాడగా వాళ్ళ యూట్యూబ్, ఎఫ్‌బీ సబ్‌స్క్రైబర్స్‌ ఎక్కడా తగ్గలేదని వారు స్పష్టం చేస్తున్నారు. పవన్ అభిమానుల వాదన మాత్రం తగ్గిందనే అంటున్నారు.