mictv telugu

సోషల్ మీడియాకు బానిసైతే అంతే సంగతి

January 14, 2019

 సోషల్‌ మీడియాకు బానిసైతే అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని గతంలో కొన్ని అధ్యయనాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు అడిక్ట్‌ కావడం, కొకైన్‌, హెరాయిన్‌లకు బానిసవడం వంటిదేనని ఓ అథ్యయనం హెచ్చరిస్తోంది. సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయినవారు నిజజీవితంలో స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేరని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ చేపట్టిన ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.

Telugu News Is Social Media Addiction A Disorde .

కొకైన్‌, హెరాయిన్‌ వంటి డ్రగ్స్‌ తీసుకునే వారిలో కనిపించే లక్షణాలు సోషల్‌ మీడియాకు అడిక్ట్ అయిన వారిలో కనిపిస్తున్నాయని ఈ అధ్యయన పరిశోధనా పత్రం పేర్కొనడం గమనార్హం. 71 మందిపై చేపట్టిన ఈ సర్వేలో ఫేస్‌బుక్‌పై గంటల తరబడి ఉండేవారు స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, వారితో పోలిస్తే ఫేస్‌బుక్‌లో తక్కువ సమయం వెచ్చిస్తున్న వారు చురుగ్గా ఉంటున్నారని వెల్లడైంది. సోషల్‌ మీడియా దుష్ప్రభావాలపై తాజా సర్వే వెల్లడించిన అంశాలు చర్చకు తావిస్తున్నాయి. కాగా సోషల్‌ మీడియా ఎడిక్షన్‌తో కుంగుబాలు, గాబరా, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని గతంలో రాయల్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ హెల్త్‌ సర్వే నివేదిక స్పష్టం చేసింది.

Telugu News Is Social Media Addiction A Disorder? Researchers Think The Problem Needs To Be Taken More Seriously