mictv telugu

మోదీకి దీటైన నాయకురాలు మమతేనా..?

February 6, 2019

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష చేశారు. యావత్ దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు తానే ఏమిటో నిరూపించుకున్నారు. మిత్రపక్షాలను తన వద్దకు రప్పించుకున్నారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి తానే తిరుగులేని విపక్ష నేతనని నిరూపించుకున్నారు. మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటీ? ఈ దీక్ష ద్వారా మోదీకి కౌంటర్ లీడర్ ఎవరంటే మమతా అనే స్థితికి వెళ్లారామే. కాంగ్రెస్ నాయకులూ దీక్షకు మద్దతు తెలిపారు.

మోదీ, మమతా బెనర్జీ ఇద్దరూ ఎవరి గేమ్ వారు బాగానే ఆడారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. కాకాపోతే దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా నాలుగేళ్లలో తెచ్చుకోలేని క్రేజ్‌ను మమతా మూడంటే మూడే రోజుల్లో సాధించుకున్నారు. అంతకుముందు కలకత్తా బ్రిగేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టి తన సత్తా చాటుకున్నారు. కలకత్తా వీధుల్లో ధర్నా చేసి ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఇదంతా దీదీకి పనికొచ్చే విషయం. ఇటు చంద్రబాబునాయుడు, ఇతర మిత్ర పక్షాలూ అంతా ఆమె చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న మాయావతి, రాహుల్ గాంధీలు కూడా అనివార్యంగా మమతను అనుసరించాల్సి వచ్చింది.

Telugu News who will be the prime ministerial candidate for bjp in 2019 lok sabha polls Modi or Gadkari or yogi  ...

ఇప్పుడు తన పోరాట వేదికను ఢిల్లీకి మారుస్తానని మమత అంటున్నారు. దేశ రాజధానిలో ఆమె ఆందోళన చేస్తే గనుక అది మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఆమెకు జాతీయ రాజకీయాల్లో మరింత పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. కమ్యూనిస్టు నాయకులకు అప్పట్లో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తీసుకోలేదు. మరోసారి మమతా బెనర్జీ రూపంలో బెంగాల్ నుండి భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందనే చర్చ కూడా బెంగాల్లో జరుగుతున్నది.

మాటలు తూటల్లా పేలుస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటానని అంటున్నారు. మూడు రోజులుగా జరిగిన ఘటనల గురించి సుప్రీం కోర్టు స్పందించిన తర్వాత ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. దీక్ష విరమణ సందర్భంగా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తాత్కాలికంగానే ఆమె కూటమిలో తొలినేతగా కన్పిస్తున్నా కూడా ఇదంతా ఇప్పటి వరకేనని కొంత మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయంగా ఉంది. కానీ మమతా విషయంలో అలా అనుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు. తాన తొలినాళ్లలో సోమ్‌నాథ్ ఛటర్జీ పోటీ చేశారు. ఆయనను ఓడించేంత సీన్ లేదని అప్పట్లో అంతా అనుకనున్నారు. కమ్యూనిస్టు నాయకులు ఆమెను సీరియస్‌గా తీసుకోలేదు. ఆమె జనంలో కల్సి తిరిగిన తీరు, ఆమె మాటపద్దతి ఓటర్లను బాగా ఆకట్టుకున్నది. కమ్యూనిస్టు ఉద్దండ పిండాన్ని ఓడించి బెంగాల్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పుడు గాని ఆమె సత్తా ఏమిటో కమ్యూనిస్టులు గుర్తించ లేకపోయారు. ఆ తర్వాత ఆమె విషయంలో సీరియస్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మోదీకి అనుభవంలోకి వచ్చింది మమతా దెబ్బ ఏమిటో. మోదీని ఢీకొనే తనే ఈమేననే అభిప్రాయాన్ని ఇప్పటికైతే కల్పించారు. ముందు ముందు ఇంత స్థాయిలో ఆమె ప్రతాపం ఉంటుందా. మిత్ర పక్షాలు ఆమెకు ఇంతే స్థాయిలో సహకరిస్తాయా అంటే వీటికి వెంటనే సమాధానం చెప్పలేం. కాకపోతే రాహుల్ గాంధీ మేలుకోక పోతే మోదీకి కౌంటర్ లీడర్‌గా మమతాను మంచి అప్షన్‌గా ముందుకొచ్చినా రావొచ్చు మరి.

Telugu news is West Bengal chief minister Mamata Banerjee becoming a strong leader against prime minister Narendra Modi