mictv telugu

ఇషా అంబానీ-ఆనంద్‌ల బంగారు పెళ్లిపత్రిక.. వీడియో

November 6, 2018

మనదేశ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నీతా అంబానీల ముద్దుల పుత్రిక ఇషా అంబానీ వివాహానికి సమయం దగ్గర పడుతుండడంతో పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యింది అంబానీ కుటుంబం. ఇటీవల ఇటలీలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరుపుకున్న ఇషా అంబానీ – ఆనంద్ పిరమల్ జంట మూడుముళ్ల సంబరానికి సిద్ధం అవుతోంది. కాగా ఇషా అంబానీ బంగారు పెళ్లి పత్రికకు సంబందించిన ఒక వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్పొరేట్‌ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్‌ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకోనుంది.Telugu news isha ambani and anand piramal golden wedding card video goes viral in social mediaకాగా డిసెంబర్ 10న ఇషా-ఆనంద్‌ల వివాహానికి సంబందించిన పలు వార్తలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ బియాన్సే  ప్రదర్శన ఇవ్వనున్నారనీ, ఇందుకు ఆమెకు భారీగానే దాదాపు రూ.15 కోట్ల పారితోషికం ఆఫర్‌ చేశారని సమాచారం.

isha ambani and anand piramal golden wedding card video goes viral in social media