సినీరంగంలోకి ఇషా అంబానీ! - MicTv.in - Telugu News
mictv telugu

సినీరంగంలోకి ఇషా అంబానీ!

September 11, 2017

అనిల్ అంబానీ కూతురు ఇషా అంబానీ సినీరంగ ప్రవేశం చెయ్యనుంది. ఆమెకు హీరోయిన్ కున్న లక్షణాలు పుష్కలంగా వున్నాయని చాలా మంది అనుకున్నారు. కానీ.. ఇషా కో ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది. అటు తల్లి వారసత్వాన్ని, ఇటు తండ్రి నెరవేరుస్తున్నది ఈ తనయ. తండ అనిల్ అంబానీ మంచి బిజినెస్ మ్యాన్.

తల్లి నీతూ అంబానీ సినీ నటి. సో.. బిజినెస్, సినిమాను రెండింటిని ఒక్కదానిలో చూస్తున్న ఇషా చాలా తెలివిమంతురాలే. ఇంతకూ తను కో ప్రొడ్యూసర్ గా టైఅప్ అయింది ఎవరితో అనుకుంటున్నారూ.. ? బాలీవుడ్ గ్రేట్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా కూడా ఫైనల్ అయిపోయాడు.

బైటల్ ఆఫ్ సారాగడీ ’ పేరుతో నిర్మితమౌతోంది ఈ సినిమా. చారిత్రాత్మక సారాగడీ నేపథ్యంలో సినిమా సాగుతుందట. తొలుత ఈ సినిమాను కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ తో కలిసి నిర్మించాలనుకున్నాడట. తర్వాత ఎందుకో సల్లూ పక్కకు తప్పుకున్నాక సీన్లోకి ఇషా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్టెక్కనున్నది. ఇషాకి అందం వుంది. నటన అనేది తన రక్తంలోనే వుంది కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా తనే చేస్తే బాగుంటుందంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.