‘ఫిఫా’ రక్తపాతంపై ఐసిస్ ఫోటోలు
2018 లో జరగనున్న ఫిఫా వేడుకల్లో రక్తపుటేరులు పారిస్తామని ఈ మధ్య ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ కటకటాల వెనుక వుండి రక్తకన్నీరు కారుస్తున్న ఫోటో కూడా విడుదల చేశారు.
తాజాగా ఐసిస్ మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఇప్పుడు ఈ పోటోలు సోషల్ మీడియాలో గుబులు రేపుతున్నాయి. 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై ఉగ్రదాడి చేసి రొనాల్డో, మెస్సీ, నెమార్ జేఆర్‌లను హత్య చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఊహాజనిత ఫొటోలను కూడా విడుదల చేసి అందరినీ విస్మయానికి గురి చేశారు. ముగ్గురినీ, పలు రకాలుగా చంపుతున్నట్లుగా ఫోటోలలో చూపించారు. 2018 లో అత్యంత అట్టహాసంగా రష్యా వేదికగా మొదలు కానున్న ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌పై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్నేయడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ‘అపజయమంటే ఏంటో తెలియని రాజ్యంతో మీరు పోరాడుతున్నారు’ అని హెచ్చరించింది ఐసిస్.