రంగస్థలం నిర్మాతల ఇళ్ళల్లో ఐటీ దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

రంగస్థలం నిర్మాతల ఇళ్ళల్లో ఐటీ దాడులు

March 29, 2018

మార్చి 30న విడుదలకు సిద్ధమవుతున్న ‘ రంగస్థలం ’ సినిమా నిర్మాతలకు ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నివాసాలపై దాడులు చేసినట్టు వార్తలు వచ్చాయి. రంగస్థలం, సవ్యసాచి సినిమాలకు సంబంధించిన అకౌంట్లను తనిఖీ చేసినట్టు వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.రెండు చిత్రాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులకు అప్పగించారట. అయితే ఈ విషయంపై సదరు నిర్మాతలు ఇంకా స్పందించలేదు. వారు స్పందిస్తేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం వుంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అవుతోంది.