పైసల తుఫాను రేపుతున్న ‘ ఇట్ ’ - MicTv.in - Telugu News
mictv telugu

పైసల తుఫాను రేపుతున్న ‘ ఇట్ ’

September 13, 2017

‘ ఇట్ ’ సినిమా రిలీజైన మూడు రోజులకే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసి రికార్డులు బ్రేక్ చేస్తోంది. సెప్టెంబర్ 8 న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టుగా దూసుకుపోతోంది. బాహుబలి 2 టోటల్ గ్రాస్ తీస్కుంటే 1800 కోట్లు, దంగల్ 2000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్ఠించాయి. తాజాగా ఇట్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే నిర్మాతలకు నోట్ల వర్షం కురిపిస్తోంది. ఇంకా ముందు ముందు యాభై, వంద రోజులకు ఎన్ని కలెక్షన్లు చేస్తుందనే డైలమాలో పడ్డారు విశ్లేషకులు. ఎందుకు ఇంతగా ఈ సినిమా ప్రజాదరణ పొందుతోంది అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే.. మహిళలను, పిల్లలను ఆకట్టుకునే సినిమాలు ఎప్పుడూ సూపర్ హిట్లు గానే నిలుస్తాయి. మరి ఇట్ ఏ టైపాఫ్ జోనర్ ? ఇది కంప్లీట్ పిల్లలకు సంబంధించిన సినిమా.

కాకపోతే హర్రర్ మిక్స్ అయిన ఫ్లేవర్ వుంటుంది. స్టీఫెన్ హాకింగ్ నవల ఆధారంగా ఆండీ ముచీట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్ల నిండా జనాలతో కిటకిటలాడుతూ పైసల తుఫాను రేపుతున్నది. జోకర్ వేషాధరణలో వుండే ఒక దయ్యం పిల్లలను మట్టుబెడుతుంటాడు. చివరికి ఆ పిల్లలు దాన్ని ఎలా అంతమొందించారనేది చాలా ఉత్కంఠగా సాగుతుంది. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా సాగుతూ సినిమా చూస్తున్న ప్రేక్షకులను కుర్చీకి కట్టి పడేస్తుంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని వూహించలేదట నిర్మాతలు. చూడాలి ముందు ముందు ఇంకా ఎన్ని కలెక్షన్ల సునామీలు సృష్ఠించనుందో ఇట్ సినిమా.