సిరిసిల్లలో నేలరాలిన నెమలి పిట్టలు - MicTv.in - Telugu News
mictv telugu

సిరిసిల్లలో నేలరాలిన నెమలి పిట్టలు

April 24, 2018

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది అయిందంటేనే ఎండ తీవ్రస్థాయిలో వుంటోంది. మధ్యాహ్నాలు అయితే అసలు బయటకు వెళ్ళకుండా వుంటోంది. ఎండ వేడిమికి అన్నీ సదుపాయాలు వున్న మనుషులే అల్లాడిపోతున్నారు. మరి అడువుల్లో వుండే జంతువుల పరిస్థితి ఎలా వుంటుంది ? ఎండ వేడిమికి తట్టుకోలేక రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ గ్రామంలో 5 నెమళ్ళు మృత్యువాత పడ్డాయి. ప్రతిఏటా నెమళ్ళు, వన్య ప్రాణుల దాహార్తి తీర్చటానికి నీటి గుంటలు ఏర్పాటు చేసేవారు అధికారులు. ఈసారి అలాంటి ఏర్పాట్లు లేకే నెమళ్ళు మృత్యువాత పడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు అడవుల్లో చెట్లు కూడా ఎండిపోతున్నాయి, చెరువులు, గుంటల్లో నీరు అడుగంటి పోతోంది. జంతువులకు, పక్షులకు తాగేందుకు నీళ్ళు లభించక అవి ప్రాణాలు కోల్పేయే పరిస్థితి నెలకొని వుంది. ఇంకా ముందు ముందు ఎండ తీవ్రత ఎలా వుంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం సందర్భంగా జంతువులు, పక్షుల కోసం తగు ముందు జాగ్రత్త ప్రణాళికలు రూపొందించాలని స్థానికులు అంటున్నారు.