అది గుడి కాదు గోరీనే మొర్రో.. తాజ్‌మహల్పై ఏఎస్ఐ - MicTv.in - Telugu News
mictv telugu

అది గుడి కాదు గోరీనే మొర్రో.. తాజ్‌మహల్పై ఏఎస్ఐ

February 22, 2018

ఏడు వింతల్లో ఒక వింత కట్టడమైన సుందర  తాజ్ మహల్‌పై వింత వింత కథనాలు చాలా కాలం నుంచి వినబడుతూనే వున్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్  తన భార్య ముంతాజ్ స్మృతికి చిహ్నంగా దాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. మరోవైపు ఇది శివాలయమని దాన్ని కూలగొట్టి ముస్లిం పాలకులు గోరీ కట్టారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజ్‌మహల్ శివాలయం కాదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)  స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగ్రా కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది షాజహాన్ తన భార్య స్మృతిచిహ్నంగా నిర్మించిన కట్టడమని పురావస్తు శాఖ తరపు న్యాయవాది అంజనీ శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  తేజో మహాలయ్ పేరుతో కొందరు చేస్తున్న వాదనలు పుకార్లు మాత్రమే. ఘన చరిత్రకు తాజ్ నిలువెత్తు సాక్ష్యం. ఎన్నో ఏళ్ళ చరిత్రగల దాని పేరు మార్చటం అనేది చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. తాజ్ సమాధి అనేది అపోహ మాత్రమే ’ అని పేర్కొన్నారాయన.