లోకేష్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన ఫేస్‌బుక్! - MicTv.in - Telugu News
mictv telugu

లోకేష్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన ఫేస్‌బుక్!

February 20, 2018

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తికి ఫేస్‌బుక్ సై అంది. ఈరోజు ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధులు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో మాట్లాడుతూ ‘ఏపీలో జరిగే ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు ఫేస్ బుక్ సహకారం అందిచాలని’ వారిని కోరారు. ఇంటర్నెట్ అనేది  ప్రజలకు ప్రాథమిక హక్కుగా మారనుందని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తున్నామని  లోకేశ్ అన్నారు.

గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తులను  ఆన్ లైన్ మార్కెటింగ్‌ చేసేందుకు ఫేస్ బుక్ సహకరిస్తే  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే లోకేష్ చేసిన విజ్ఞప్తికి ఫేస్ బుక్ ప్రతినిధులు ఒకే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు. గ్రామాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్‌కు డిజిటల్ ట్రైనింగ్ ఇస్తామని”  అన్నారు.