ఫేస్‌బుక్ నమ్మకద్రోహం.. రూ. 80 కోట్ల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ నమ్మకద్రోహం.. రూ. 80 కోట్ల జరిమానా

December 8, 2018

యూజర్ల డేటాను చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు కోర్టులో చుక్కెదురైంది.  యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను అమ్ముకుంటోందని దాఖలైన కేసులో ఇటలీలోని కాంపిటిషన్‌ అథారిటీ ఏజీసీఎం.. ఫేస్‌బుక్‌కు 10 మిలియన్‌ యూరోల(రూ. 80కోట్లు) జరిమానా వేసింది. అంతేకాకుండా ఈ నేరానికిగాను తన వెబ్‌సైట్‌లో క్షమాపణ కూడా చెప్పాలని ఆదేశించింది.Telugu news Italian regulator fines Facebook £8.9m for misleading users Company criticised over data misuse and ordered to issue an apology on its website and appఖాతాలు తెరవడానికి యూజర్లు అందించే వారి వివరాలను ఫేస్‌బుక్  పక్కా వాణిజ్య అవసరాలకు వాడుకుంటోంది. ఈ విషయాన్ని యూజర్లుకు ముందే చెప్పకుండా నమ్మకద్రోహానికి పాల్పడుతోంది. అసలు తాను అందించే సేవల ఉద్దేశాలేంటో కూడా చెప్పడం లేదు.. ’ అథారిటీ ఆరోపించింది. కేంబ్రిడ్జి అనలిటికాకు యూజర్ల డేటాను అందించిందని ఫేస్‌బుక్ సంస్థపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ కోర్టు కూడా 5 లక్షల పౌండ్ల జరిమానా వేసింది. అయితే తాము అమ్మడంలేదని, కొన్ని పొరపాట్ల వల్ల డేటా లీక్ అయిందని ఫేస్ బుక్ చెబుతోంది.