కావాలని కాదు.. అవసరం: సమంత - MicTv.in - Telugu News
mictv telugu

కావాలని కాదు.. అవసరం: సమంత

February 9, 2018

సహజంగా మన తెలుగు సినిమాల్లో హీరోయిన్‌కు పెళ్ళైతే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. క్రమంగా సదరు కథానాయిక రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిందే. కానీ సమంత విషయంలో అది పూర్తిగా రివర్స్ అవుతోంది.  మంచి ఫామ్‌లో వుండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా ఎంచక్కా సినిమాలు చేసుకుపోతోంది. బాలీవుడ్‌లో పెళ్లైన హీరోయిన్లకు కరిజ్మా  ఏమాత్రం తగ్గదు. ఆ బాటలో సమంత చేరింది. మహానటి, రంగస్థలం సినిమాలు చేస్తూ బిజీగా వుంది.అయితే సమంత సినిమాలే లైఫ్ అనుకోలేదు. పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచించాలనుకుంది. ఇటీవల కాస్త తీరిక దొరికితే చక్కా ఎంజాయ్ చెయ్యాలని నిశ్చయించుకున్నది. ‘తీరిక లేని పనులతో చాలా అలసిపోయాను. ఇది వెకేషన్ టైమ్. ఇది కావాలని కాదు.. నాకు చాలా అవసరం ’ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకొన్న ఫోటోను పోస్ట్‌కు జతచేసింది. కాగా ఆమె పోస్ట్‌కు  ‘కూల్ బేబీ… విశ్రాంతి తీస్కో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.

https://www.instagram.com/p/Be7eVsgnUl-/?utm_source=ig_embed