ఇవాంకా టూర్‌పై సునీత పోస్ట్  వైరల్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా టూర్‌పై సునీత పోస్ట్  వైరల్..

November 24, 2017

అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా నగరాన్ని ముస్తాబు చేయడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రధాన రోడ్లనే అందంగా మారుస్తున్నారని,  మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని సునీత ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘ట్రంప్‌ కూతురు ఇవాంకా రాయదుర్గం – ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బావుండు ’ అంటూ సునీత పోస్ట్ పెట్టారు. ఈ అభివృద్ధి పనులు కేవలం ఆమె తిరిగే రోడ్లకే పరిమితమా ? అంటూ సటైర్ వేశారు. సాధారణంగా ఇలాంటి అంశాలపై స్పందిచని సునీత ఈ పోస్ట్ పెట్టడంపై అభిమానులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. పాతబస్తీలోని రోడ్లన్నీ, ఐటీ కారిడార్‌‌లు తళతళ మెరుసిపోతున్నాయి. అక్కడి రోడ్లకు ఇరువైపులా  రంగులు, ఫ్లైఓవర్లకు పెయింటింగులు, పచ్చదనంతో ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.