కేటీఆర్‌తో ఇవాంకా ఏం చెప్పిందంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌తో ఇవాంకా ఏం చెప్పిందంటే..!

November 30, 2017

అమెరికాతో తెలంగాణ దోస్తీ మరింత బలోపేతం కానుంది. అభివృద్ధికి కలిసి పనిచేద్దామని,  అమెరికా రావాలని స్వయంగా ఇవాంకా ట్రంప్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఇందుకు కేటీఆర్ కూడా సుముఖత చూపారు. ‘ఇప్పటికే అమెరికాతో తెలంగాణకు సత్సంబంధాలున్నాయి. ఆ దేశానికి చెందిన ఐదు సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. మరో 100 సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ, ఇతర లక్ష్యాలతో త్వరలోనే అమెరికాకు వెళ్తా ’ అని కేటీఆర్‌ చెప్పారు.

ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాలో ఉన్న ఇవాంకా ట్రంప్‌, కారెన్‌ క్వింటోస్‌, చెర్రీ బ్లెయిర్‌, చందా కొచ్చర్‌తో పాటు ఇతర మహిళా ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను తెలంగాణలో అమలు చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మరిన్ని రాయితీలు ఇస్తామని, పారిశ్రామిక విధానంలోనూ వారికి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.