గోల్కొండ కోటలో ఇవాంకా చప్పట్లు - MicTv.in - Telugu News
mictv telugu

గోల్కొండ కోటలో ఇవాంకా చప్పట్లు

November 29, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కూతురు  ఇవాంకా నిన్న ఫలక్‌నామా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఆరగించిన విషయం తెలిసిందే. ఆమె  ఈరోజు గోల్కొండ కోటను సందర్శించింది. కోటను చూసి ఫిదా అయ్యింది. బ్యాటరీ కారు ఏర్పాటు చేసినా ఆమె కాలినడకనే తిరుగుతూ  కోటలో ఉన్న పలు కట్టడాలను పరిశీలించింది. పురాతనమైన కోటను కాపాడుతున్న తీరును ఆమె మెచ్చుకుంది.కోటలోని రాజప్రసాదంలో రాజు సేవకులు, సందర్శకులను పిలిచే విధానాన్ని వివరించగా, అక్కడ ఇవాంకా చప్పట్లు కొట్టి ముచ్చటపడింది. మహిళా అధికారి ఒకరు ఈ కోట విశిష్టతను ఆమె వివరించారు.

ఇవాంకా గోల్కొండ కోటకు వస్తుండడంతో ఈరోజు  అధికారులు సందర్శకులను ఎవ్వరినీ అనుమంతిలేదు. అంతేకాదు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉదయం 12 గంటలనుండి రాత్రి 10 గంటలవరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆమెతోపాటు చాలామంది విదేశీ అతిథులు గొల్కొండకోటను సందర్శించారు.  అయితే ఇవాంకాతో పాటు అందరికి గోల్కొండ కోటలో సాయంత్రం 6 గంటలకు విందు ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.