ఇవాంకాపై దాడికి  ఉగ్రవాదుల కుట్ర! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాపై దాడికి  ఉగ్రవాదుల కుట్ర!

November 28, 2017

జీఈఎస్ సదస్సు కోసం  హైదరాబాద్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ లక్ష్యంగా దాడి చేయడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రపన్నుతారని నిఘా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్, భారత నిఘా వర్గాలకు హెచ్చరించడంతో  ఆమెకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్పటికే సదస్సు భద్రత కోసం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,400 మంది  పోలీసులను మోహరించింది.  అమెరికా  నుంచి 8 మంది సీక్రెట్ అధికారులు అనుక్షణం ఇవాంక చుట్టు  రక్షణ కల్పిస్తున్నారు.

తెలంగాణకు చెందిన 200 మంది అనుమానితుల  కదలికలను నిఘా వర్గాలు గమనిస్తున్నాయి. . ఇవాంక కోసం ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన విధ్వంసక వ్యతిరేక, యాంటీ ఎక్స్ ప్లోజిన్ ప్రత్యేక పరికరాలను హెచ్ఐసీసీ. ఫలక్ నుమా,   ట్రైండెంట్ హోటల్ వద్ద ఉంచారు. పరిసర ప్రాంతాల్లో నిఘా వర్గాలు డేగకళ్లతో కాపలా కాస్తున్నాయి.