ఇవాంకా తినే భోజనం మీరూ తినొచ్చు.. జస్ట్ రూ. 18 వేలు మాత్రమే - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా తినే భోజనం మీరూ తినొచ్చు.. జస్ట్ రూ. 18 వేలు మాత్రమే

November 28, 2017

అగ్రరాజ్య అధినేత కూతురు ఇవాంకా విందు చేసే ఫలక్ నుమా ప్యాలెస్ మీరు కూడా భోజనం చేయలనుకుంటున్నారా? అయితే కేవలం రూ. 18,000 చెల్లిస్తే చాలు. ఎవరైనా తినేయొచ్చు. జీఈఎస్ సదస్సు కోసం వచ్చిన ఇవాంకాకు, మోదీకి, ఇతరులకు  తెలంగాణ ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనుంది.

ఈ ప్యాలెస్‌లోప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ టేబుల్ పొడవు 108 అడుగులు. ఇక ఈ టేబుల్ పైన 101 మంది ఒకేసారి కూర్చుని బోజనం చేయవచ్చు. టేబుల్‌కు అటువైపు 50 మంది, ఇటువైపు 50 మంది కూర్చోవచ్చు. మధ్యలోప్రత్యేక అతిథి కూర్చోవచ్చు. అక్కడ నుంచి అతిథి మైక్ లేకుండా  మాట్లాడినా అందరికీ వినిపిస్తుంది.

ఇక్కడ కేవలం   వీఐపీలకే బోజనం పెడుతారని అనుకోవద్దు. ఎవరైనా ఒక పూట బోజనం చేయాలనుకుంటే కేవలం రూ. 18 ,000 చెల్లిస్తే చాలు. నచ్చిన పదార్థాలను ఎంత కావాలంటే అంత తినొచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. డైనింగ్ టేబుల్ పైన 40 మంది తక్కువగా కాకుండా ఉండాలి. ప్యాలెస్ లో ఒక్క రోజు బస చేయాలంటే రూ. 46 వేలు చెల్లించాలి.