ఇవాంక కోసం అమెరికా నుంచి కార్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంక కోసం అమెరికా నుంచి కార్లు

November 23, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  కుమార్తె ఇవాంకాకు ప్రపంచ ఉగ్రవాద సంస్థలన్నింటి నుంచి ముప్పు పొంచి ఉంది.  ప్రధానంగా సిరియాలోని ఐసీఎస్ ఉగ్రవాదులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  హైదరాబాద్‌లో జరగనున్న పారిశ్రామిక సమ్మిట్‌కు ఇవాంకా హాజరుకానున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఆమెకు అసాధారణ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు అన్ని అమెరికా అధికారులే పర్యవేక్షిస్తున్నారు.  ఇవాంకా కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి మూడు వాహనాలను హైద్రాబాద్‌కు తెప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం జనరల్ మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన లీమోజీన్ వాహనాలు హైదరాబాద్‌కు రానున్నాయి. మందుపాతరలు,తుపాకి తుటాలు నుంచి మాత్రమే కాదు రాకెట్ లాంచర్లు, జీవ రసాయన దాడుల నుంచి రక్షించగలిగేలా అన్ని సదుపాయాలు వాహనంలో ఉంటాయి.  ఆధునాత సమాచార వ్యవస్థతో కూడిన ఓ కార్యాలయం కూడా ఉంటుంది.