‘జబర్ధస్త్’ యాంకర్ రష్మీ రాంగోపాల్ వర్మ తీసిన ‘జీఎస్టీ’ పార్ట్-2లో నటించడానికి తనకేమి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే ఆ సినిమాకు దర్శకుడిగా వర్మ మాత్రం వద్దు. ‘గరుడవేగ’ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అయితే ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ 2’లో నటిస్తాను అని చెప్పింది.
ట్విట్టర్లో ఫాలోవర్స్ ‘జీఎస్టీ-2’లో నటిస్తారా అని ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నకు రష్మీ పై విధంగా సమాధానం చెప్పింది. ఇక అనసూయ ఫోన్ పగలకొట్టడంపై ‘పబ్లిక్‌లో ఎలా ప్రవర్తించాలో మీరైనా అనసూయకు చెప్పొచ్చుగా’ అని అడుగగా నేను ఆమె సలహాదారురాలిని కాను అని రష్మి సమాధానం చెప్పింది.