హైపర్ ఆదీ.. మీ ఇంట్లో ఇలాగే మాట్లాడతావా? - MicTv.in - Telugu News
mictv telugu

హైపర్ ఆదీ.. మీ ఇంట్లో ఇలాగే మాట్లాడతావా?

November 24, 2017

ఈటీవీ ‘జబర్దస్త్’ షోలో పంచుల పేరుతో వల్లిస్తున్న బూతులు ప్రేక్షకులను తలదించుకునేలా చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చాలామంది ఈ కార్యక్రమాన్ని చూడాలంటే సిగ్గుపడుతున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది వేస్తున్న పంచులు మహిళలను కించపరచేలా ఉన్నాయని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ‘ఆదీ.. మీ ఇంట్లో ఇలాగే మాట్లాడతావా?’ అని ప్రశ్నిస్తున్నాయి.  ఇవి పంచులు కాదని మానసిక ఆరోగ్యం లేని వాళ్లు పలుకుతున్న పచ్చి బూతులను విమర్శలు వస్తున్నాయి. ద్వంద్వార్థాలు, వివక్ష, అమర్యాద వంటి అవలక్షణాలన్నీ కలగలసిన ఈ ప్రోగ్రాం నుంచి రోజా, నాగేంద్ర బాబు వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మహిళా సంఘాలు ఈ ప్రోగ్రాం ఎంత జుగుప్సగా ఉందో చెప్పడానికి కొన్ని సంభాషణలు సేకరించాయి.. వాటిలో కొన్ని..హైపర్ ఆది బూతు పంచులు

సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గాని.. పెళ్లైన తర్వాత అర్థమైంది నాకు.. చెరుకు మిషన్లో  ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్లీ మళ్లీ పెట్టినా పిప్పేగాని ప్రయోజనం ఉండదు.

(శోభనం గదిలో) నేను ధోని లాంటోన్నే. ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసినా ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఇస్తాను

ఒక దీపం వెలిగించడానికే నూనె లేదంటే కాజల్ వచ్చి క్వాలిటీ నూనె అడిగిందట

ఎవండీ నేను అందంగా లేనా! కుక్క అందంగా ఉందని కాపురం చేస్తామా?  కాపాలాగానే ఉంచుతాం

పత్తి పురుగుల మందు హానికరం కదండీ..(పెళ్లాం కంటేనా అలని జవాబు)

వైఫ్, భార్య, పత్ని  ప్రమాదానికి నానార్థాలు

పెళ్లికి ముందు..  అమ్మాయి వడ్డించిన విస్తారాకు. పెళ్లి తర్వాత ఎంగిలి విస్తరాకు..  పడెయ్యాలనిపిస్తుంది

నా పెళ్లాం బాడీ చూశావా? ఏదెక్కడుందో మనమే గుర్తించాలి..

మగాళ్లు నాశనమయ్యే ప్రక్రియే శోభనం

శోభనం గదిలో మల్లెపూలు మనకు ఉచ్చు బిగించి  మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి

నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే…  వాడుకోవడమే తప్ప ఇంట్లో పెట్టుకోరు

ఎవండీ ఏంటండీ..  ఆ కర్రను కూడా లేపలేక పోతున్నారు (నీలాంటి దానిని చేసుకుంటే ఈ కర్ర లేపలేం..ఏ…………అని జవాబు)

ఆడాళ్లు పొద్దున మంగళ సూత్రానికి ఎందుకు మొక్కుతారంటే…మొగుడు రాత్రి మంగళ సూత్రాన్ని ఉంచాడా తాకట్టు పెట్టాడా అని చూడడానికే

కట్నమిచ్చి జీవితాంతం మనల్ని  సాంతం నాకిచ్చేదే పెళ్లాం

ఇవి జస్ట్  శాంపుల్ మాత్రమే ఇలాంటివి ఇంకా వేలల్లో ఉన్నాయని మహిళా సంఘం ప్రతినిధి పువ్వాడ ధరణి చెప్పారు.   కామెడీ పేరుతో విలువలను మరచి  ఆడవాళ్లను, మిగతా వారిని కించపరుస్తూ  వాళ్ల మీద బూతు పంచులు వేసే వీళ్లకు పాపులారిటీ పెంచి పెద్ద చేస్తున్నది మనమే అని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ‘ ఇంట్లో చిన్న పిల్లలుంటారు, వయసు మళ్లిన పెద్దవాళ్లుంటారు వారందరితో కలిసి ఇలాంటి బూతు షోలను చూడగలమా ?  ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే  సమాజంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో వేరే చెప్పక్కర్లేదు’ అని ఆమె అన్నారు.