గుంట నక్కలకు సెల్యూట్ కొట్టకండి - MicTv.in - Telugu News
mictv telugu

గుంట నక్కలకు సెల్యూట్ కొట్టకండి

November 20, 2017

వైసీపీ నేత జగన్ సోమవారం కర్నూలు జిల్లా ఉసేనాపురంలో జరిగిన ‘మహిళా సదస్సు’లో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి వస్తున్న  మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో, జగన్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.  ‘మీరు పనిచేస్తున్నది మీ టోపీ మీదున్న మూడు సింహాలకోసం కానీ, వాటి వెనకున్న గుంట నక్కలకోసం కాదు.ఆంధ్రప్రదేశ్‌లో కలకాలం చంద్రబాబు పాలనే ఉండదు,ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఓ ప్రతిపక్షనేతగా ఆడవాళ్ల కష్టాలు వినేందుకు నేను వస్తే మీరు అడ్డుకోవడం అన్యాయం’ అని జగన్ పోలీసులపై మండిపడ్డాడు.