ప్రతీ తల్లికి 15 వేలు,పెన్షన్ రూ.2 వేలు   - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతీ తల్లికి 15 వేలు,పెన్షన్ రూ.2 వేలు  

November 20, 2017

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో నిర్వహించిన మహిళల సదస్సులో  వైసీపీ నేత జగన్ మహిళలకు వరాల జల్లు కురిపించారు.  ‘ అమ్మ ఒడి‘ స్కీమ్ కింద ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్‌లోకి రూ. 15వేలు నేరుగా వేస్తాం.

దీని ద్వారా ఇద్దరు పిల్లలను చదివించవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి ఫీజు రియంబర్స్‌మెంటు చేస్తాం, అలాగే హాస్టల్ ఖర్చులకు నెలకు రూే. 20 వేలు ఇస్తాం.  పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచుతాం.  మైనార్టీలు, వెనకబడిన తరగతుల వారి  వయసు పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తాం. ప్రతీ గ్రామంలో తప్పనిసరి గ్రామ కార్యదర్శులను నియమిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం.. తమ మేనిఫెస్టోను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, మహిళలు గర్వంగా బతికేలా రూపొందిస్తామని ’  జగన్ చెప్పారు.

అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేదు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై టీడీపీ వెనకడుగు వేసింది.. బెల్టు షాపులను ఎత్తేస్తామన్న చంద్రబాబు మద్యం అమ్మకాలను మరింత పెంచారు, దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మహిళల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నది..

 మహిళా సంఘాలకు రుణాలను మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోవడంతో మహిళలు మనోవేదనకు గురయ్యారు.. చంద్రబాబు వైఖరితో డ్వాక్రా మహిళలు బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మిగిలారు, వారికి లోన్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది ’ అని జగన్  చంద్రబాబుపై  మండిపడ్డారు.