వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్’కు లేఖ రాశారు.
తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా తమ పార్టీలో చేర్చుకొని, వాళ్ళచేత రాజీనామా చేయించలేదని లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ఇతర పార్టీ అధికార ప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా వారిచేత రాజీనామా చేయించాల్సిన రూలు వుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్పీకర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని జగన్ లేఖలో రాష్ట్రపతిని కోరారు.