mictv telugu

సైరాలో జగపతి బాబు లుక్ ఇలా..

February 12, 2019

సైరా నరసింహారెడ్డి చిత్రం నుంచి జగపతిబాబు లుక్ బయటకు వచ్చింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆయన వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకు ఆయన చక్కగా కుదిరారు అన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో నటించిన నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నాల లుక్‌లు విడుదల చేశారు. తాజగా విడుదల చేసిన వీరారెడ్డి లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

Telugu news Jagapathi Babu Look In Syeraa.

 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. Telugu news Jagapathi Babu Look In Syeraa