ప్రేమికుడి దగా.. లేడీ డాక్టర్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుడి దగా.. లేడీ డాక్టర్ ఆత్మహత్య

December 5, 2017

ప్రేమించవాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి  మోసం చేశాడని ఓ దంత వైద్యురాలు ఆత్యహత్య చేసుకుంది. జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ..  హైదరబాద్‌లోని చైతన్యపురిలో హాస్టల్‌లో ఉంటూ దంత వైద్యురాలుగా పనిచేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమెకు నరేశ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, గీతా చనిపోయేముందు ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘నరేశ్ అనే యువకుడి చేతిలో నేను మోసపోయాను.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అందుకే నేను చనిపోతున్నా’ అని చెప్పి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది.

సమాచారం అందుకున్న  పోలీసులు హాస్టల్‌కు చేరుకుని గీతా మృతదేహాన్ని కిందికి దించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? నిజంగా నరేశ్ అనే యువకుడు మోసం చేశాడా అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.