మేము ఆర్టిస్టులం, ఉగ్రవాదులం కాదు… ఆర్ఎక్స్100 హీరో - MicTv.in - Telugu News
mictv telugu

మేము ఆర్టిస్టులం, ఉగ్రవాదులం కాదు… ఆర్ఎక్స్100 హీరో

October 3, 2018

జగిత్యాల జిల్లాలో పదోతరగతి విద్యార్థులు కూసరి మహేందర్ ,రవితేజ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ చేసేవారు. ప్రేమ విషయంలో తలెత్తిన వివాదంతో మద్యం సేవించి, పెట్రోల్ పోసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన డీఎస్పీ వెంకటరమణ ఆర్ఎస్ 100 సినిమా ప్రేరణతోనే చనిపోయారని తెలిపారు.

అయితే  ఈ ఘటనపై ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ స్పందించాడు.. ‘ఇద్దరు విద్యార్థులు మా సినిమాను ప్రేరణగా తీసుకుని చనిపోయారని చెప్పారు. అది సరైన పద్దతి కాదు. మేం ఆర్టిస్టులం. ఉగ్ర‌వాదులం కాదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. అంతేకాదు నేటి యువ‌త చెడుకు ప్ర‌భావితం కాకుండా వారి న‌డ‌వ‌డిక‌ని గ‌మ‌నించాలి.ఆర్ఎక్స్ 100 సినిమానే ఓ విలన్‌లా చూపిస్తున్నారు. చిత్రంలో హీరో ఆత్మహత్య చేసుకోలేదు. బాధాక‌రమైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు త‌మ‌ని నెగెటివ్‌గా చూడ‌డం మానేసి, పిల్ల‌ల‌ని స‌న్మార్గంలో న‌డిపించేలా ప్ర‌య‌త్నించాలి’ అని ట్వీట్ చేశాడు. ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.