అబూ సలేంకు జీవితఖైదు - MicTv.in - Telugu News
mictv telugu

అబూ సలేంకు జీవితఖైదు

September 7, 2017

1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో మాఫియా డాన్ అబూ సలేంకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మరో దోషి కరీముల్లా ఖాన్ కు కూడా ఇదే శిక్ష విధిస్తూ ముంబైలోని ఉగ్రవాద నిరోధక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మరో ఇద్దరు దోషులు ఫిరోజ్ ఖాన్, తాహిర్ మర్చంట్ లకు మరణశిక్ష విధించింది. కోర్టు  జూలై 16న వీరిని దోషులుగా నిర్ధారించింది. హత్య, ఉగ్రవాదం తదితర నేరాలకు పాల్పడ్డారని తేల్చింది. అబూ సలేంకు  మరణదండన విధించాలన్న సీబీఐ వినతిని కోర్టు తోసిపుచ్చింది. గతంలో పోర్చుగల్ కు పారిపోయిన అబూసలేంను అతనికి మరణశిక్ష విధించరాదన్న షరతుపైన ఆ దేశం భారతదేశానికి అప్పగించింది. ఈ కేసులో మరో దోషి అయిన ముస్తఫా దోసా ఇటీవల జైల్లో మరణించాడు. మరో నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు.

1993 నాటి  బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోగా, 700 మందికిపైగా గాయపడ్డారు.