నక్సల్స్‌ను జైలు నుంచి తప్పించేందకు బీజేపీ నేత ప్లాన్ - MicTv.in - Telugu News
mictv telugu

నక్సల్స్‌ను జైలు నుంచి తప్పించేందకు బీజేపీ నేత ప్లాన్

October 10, 2018

జైల్లో వున్న మవోయిస్టు ఖైదీలను తప్పించాలనుకున్నాడు ఓ బీజేపీ నేత. ఉత్తిపుణ్యానికి కాదు, డబ్బు కోసం. దీని కోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. జైలు గోడలు బద్దలు కొట్టాలనుకున్నాడు. కానీ అతని ప్రణాళిక బెడిసికొట్టింది. చివరికి అతణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ ఛాయిబాషా జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాంశంకర్ పాండే, జైల్లో వున్న సందీప్ సోరెన్‌ను తప్పించాలని అనుకున్నాడు. పోలీస్ సిబ్బంది సహాయంతో వారిని తప్పించడానికి జైలు గోడలు కూడా బద్దలు కొట్టి తప్పించే ప్రయత్నం చేశారు. సందీప్ సోరెన్ను తప్పించడానికి నాలుగు లక్షల రూపాయల ఒప్పందాన్ని రాంశంకర్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు..The BJP leader who saw the prisoners in jail Ramashankar Pathak Pandey planned to help the maoists flee, with three security personnel from the prison itself The police said that there are more people involved in the conspiracy. దసరా సమయంలో జైలు గోడలు బద్దలు కొట్టి ఎలాగైనా సందీప్ను తప్పించాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. రాంశంకర్ తప్పించాలని చూస్తున్నఖైదీలు కరుడుగట్టిన మావోయిస్టులని ఎస్పీ తెలిపారు. రాంశంకర్ పాండేతో సహా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన ముగ్గురు విజయ్ ఖల్కో, ఛాము ముండా, జెయుల్ హోరో అని పోలీసులు వెల్లడించారు.