దేశభక్తిని చాటుకున్న జైపూర్ మున్సిపాలిటీ  - MicTv.in - Telugu News
mictv telugu

దేశభక్తిని చాటుకున్న జైపూర్ మున్సిపాలిటీ 

October 31, 2017

జాతీయ గీతం’ కేవలం సినిమా హాళ్ళల్లోనే ఎందుకూ.. ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా పార్లమెంటు, వివిధ ప్రభుత్వ ఆఫీసులల్లో జాతీయ గీతం ఆలపించొచ్చు కదా.. అని చాలా మంది ఈ వివాదాన్ని లేవనెత్తారు. బలవంతంగా దేశభక్తిని రుద్దడం సరికాదని ఈ మధ్య సినీనటి విద్యాబాలన్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల రీత్యా.. జాతీయగీతం ‘జనగణమన’పై జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రతిరోజూ జనగణమణ, ‘వందేమాతరం’ గీతాలను ఆలపించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ ఉదయం 9:50 గంటలకు జనగణమన, సాయంత్రం 5:55 గంటలకు వందేమాతరం ఆలపిస్తారు.  మున్సిపల్ ఉద్యోగులంతా తప్పనిసరిగా జాతీయగీతాన్ని ఆలపించే నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది నెటిజనుల నుండి హర్షం వ్యక్తం అవుతున్నది.