బిక్షమెత్తైనా సరే.. పోలవరంను పూర్తి చేస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

బిక్షమెత్తైనా సరే.. పోలవరంను పూర్తి చేస్తాం

November 30, 2017

అప్పట్లో బీకాంలో ఫిజిక్స్ అంటూ వార్తల్లో నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి పోలవరం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మా ఎమ్మెల్యేల ఆస్తులు అమ్ముతాం, అదీ సరిపోకపోతే  ఆఖరికి బిక్షమెత్తైనా  పోలవరాన్ని పూర్తిచేస్తామని’ జలీల్ ఖాన్ అన్నాడు.ఓవైపు టీడీపీ నేతలంతా కేంద్రంపై మండిపడుతుంటే..జలీల్ ఖాన్ మాత్రం తనదైన శైలిలో పై విధంగా స్పందించాడు. ‘పోలవరం పూర్తి చేయడం మానాయకుడు చంద్రబాబు లక్ష్యమని, దానికోసం మేం ఎంత దూరమైనా వెళతాం,అవసరమైతే  జోలెపట్టి నిధులు సేకరిస్తాం..ఏది ఏమైనా పోలవరాన్ని పూర్తి చేయకుండా వదలం’ అని జలీల్ ఖాన్ అన్నారు.