ఈ తండ్రి నాకొద్దు.. జైల్లో పెట్టండి... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ తండ్రి నాకొద్దు.. జైల్లో పెట్టండి…

February 24, 2018

కన్న కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి జంతువులా మారాడు. తాగుడుకు బానిసై విచక్షణ కోల్పోయి 11ఏళ్ల కొడుకును చిత్ర హింసలు పెట్టాడు. తండ్రి బాధలు భరించలేని ఆ చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. జమ్మికుంట పంచాయితిలోని మోత్తులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్  తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ వచ్చిన డబ్బులతో రోజూ తాగుతూ దివాళా ఖర్చులు చేస్తుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య,కొడుకు మీద ప్రతాపం చూపించేవాడు. ఈ క్రమంలో గురవారం సాయంత్రం తాగేసి వచ్చిన శ్రీనివాస్  కుమారుడు శశి కుమార్ పాఠశాలకు వెళ్లి బాలుడిపై మళ్లీ తన శాడిస్టు తనం చూపించాడు. ఇంట్లోని రూ3వేలు తీశావా అంటూ కర్రకు కారం రాసి విపరీతంగా కొట్టాడు. దాంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి, తాను డబ్బు తీయలేదని చెప్పినా కూడా వినకుండా పసివాడనే కనికరం కూడా లేకుండా గొడ్డును బాదినట్టు బాదాడు. దెబ్బలకు తాళలేక బాలుడు విలవిల్లాడుతున్న సమయంలో శశికుమార్ పెద్దమ్మ వచ్చి విడిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తన తల్లికి విషయాన్ని చెప్పి విలపించాడు.అనంతరం జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. తన  నాన్నతో ఎప్పటికైనా అమ్మకు, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తాగి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటామని విలపించాడు. పోలీసులు బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి చలించిపోయారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తన అక్క శ్వేత కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతోందని, తానూ అక్కడే ఉండి చదువుకుంటానని శశికుమార్‌ చెప్పాడు. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు సీఐ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కాగా పిల్లవాడు చాలా మంచి పని చేశాడు. రాను రాను అత్యంత క్రూరుడిగా మారుతున్నాడు. కాబట్టి శశి పోలీసులకు ఫిర్యాదు చేసి మంచి పని చేశాడని స్థానికులు బాలుణ్ణి మెచ్చుకున్నారు.