mictv telugu

బడిలో ‘ఉగ్ర’పేలుడు.. పాక్‌లో కాదు, ఇండియాలోనే

February 13, 2019

ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారని అంటారు. దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదులతో సావాసం చేస్తున్న కశ్మీర్ ఉగ్రవాదులు సరికొత్త దారుణాలకు తెగిస్తున్నారు. గతంలో స్కూళ్ల జోలికి వెళ్లని ఆ ముష్కరులు తాజాగా ఓ బడిపై దాడి చేసి, 12 మంది పిల్లలను గాయాలపాలుజేశారు.

Telugu news Jammu and Kashmir At least 12 students injured in the blast at Pulwama school.

పుల్వామా జిలా నర్బాన్ ప్రాంతంలో ఓ స్కూలులో పిల్లలు చదువుకుంటుండగా, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. తరగతి గదిలోనే బాంబు పేలడంతో 13 మంది చిన్నారులు గాయపడ్డారు. సమీపంలోని సైనికులు.. నెత్తురోడుతున్న ఆ పిల్లలను దగ్గర్లోని ఆస్పత్రికి, తీవ్రంగా గాయిపడిన వారిని శ్రీనగర్‌కు తరలించారు. ఇది ఉగ్రవాదుల పనిగానే అనుమానిస్తున్నామని, స్కూల్లో పేలుడు పాల్పడే అవసరం వారికి తప్ప మరొకరికి లేదని అధికారులు చెప్పారు. Telugu news Jammu and Kashmir At least 12 students injured in the blast at Pulwama school