భర్త నేలకొరిగాడు.. ఆమె తుపాకీ పట్టుకుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

భర్త నేలకొరిగాడు.. ఆమె తుపాకీ పట్టుకుంది..!

February 13, 2018

ఆమె ఉగ్రవాదుల దాడిలో భర్తను కోల్పోయింది. కానీ మాత్రం మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. తన భర్త అడుగుజాడల్లోనే నడిచి, దేశసేవ చేస్తానంటూ ఆర్మీలో చేరింది. త్వరలోనే లెఫ్టినెంట్ హొదాను అందుకోనుంది.

ఆమె పేరు సంగీత. జమ్మూకశ్మీర్ బారాముల్లాలోని 2015 సెప్టెంబర్ 2న జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆమె భర్త శిశిర్ మాల్ వీర మరణం పొందాడు. దాడిలో మాల్ ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాడు. కానీ ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో బలయ్యాడు. భర్త మరణించడంతో సంగీత కుంగుబాటుకు గురైంది. ఈ సందర్బంలో కుటుంబ సభ్యులు ఆమెకు బాసటగా నిలిచారు. ఆమెలో ధైర్యాన్ని నింపారు. కుంగిపోవద్దని, ఇంకా ఎంతో జీవితం ఉందని చెప్పారు. దాంతో సంగీత భర్త అడుగుజాడల్లో నడిచింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్షలు రాసింది. అందులో పాసై, శిక్షణ తీసుకుంది.

ఆమె త్వరలోనే లెఫ్టినెంట్ హోదాను అందుకోనుంది.ఆమె తీసుకున్న సాహోసోపేత నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మాల్తో కలసి పని చేసిన మాజీ ఉద్యోగులు,స్నేహితులు సంగీత ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. సంగీతను అందుకు ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఆడపిల్లలు సైన్యంలో చేరాలని కోరుతున్నారు. అమర జవాన్ల కుటుంబాల నుంచి  లెఫ్టినెంట్  హోదాను అందుకున్న మహిళగా సంగీత నిలిచింది.