రేప్‌ మేము చేయలేదు.. మాకు నార్కో పరీక్షలు చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

 రేప్‌ మేము చేయలేదు.. మాకు నార్కో పరీక్షలు చేయండి

April 16, 2018

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది  కతువా రేప్ కేసు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందిని  ఈ రోజు జిల్లా కోర్టు ముందు హాజరు పరిచారు. తమకు ఆ అత్యాచారంతో సంబంధం లేదని,తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని నిందితులు న్యాయమూర్తిని విన్నవించకున్నారు. తీర్పును ఏప్రిల్ 28కి న్యాయమూర్తి వాయిదా వేశారు. న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్ కాపీలను తన ముందు పెట్టాలని  ఆ రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు.

మరోవైపు నిందితులందరూ చీఫ్ జూడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. స్థానిక తెగలకు చెందిన కొందరు ఓ 8 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్ చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో  పేర్కొన్నారు. ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత మళ్లీ నిందితులను పూర్తి భద్రత మధ్య జైలుకు తరలించారు. త‌న‌కు నార్కో ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన నిందితుడు సాంజీ రామ్ డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచారం, హ‌త్య వెనుక కుట్ర ఉంది. త‌న తండ్రికి ఆ ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని, కేసును సీబీఐకి అప్పగించాలని  సాంజీ రామ్ కూతురు డిమాండ్ చేసింది.